జయప్రద… అనార్‌కలీ !


  • అజంఖాన్‌ కొడుకు వెకిలి వ్యాఖ్యలు
లఖ్‌నవూ, ఏప్రిల్‌ 22: బీజేపీ అభ్యర్థి జయప్రదపై ఆమె ప్రత్యర్థి అజంఖాన్‌ కుమారుడు అబ్దుల్లా అజంఖాన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘అలీ మా వాడే..బజరంగ్‌ బలీ మా వాడే.. మాకు అలీ కావాలి, బజరంగ్‌ బలీ కూడా కావాలి.. కానీ అనార్‌కలీ మాత్రం వద్దు’’ అని వెకిలిగా మాట్లాడారు. అలీ బజరంగ్‌ బలీ వ్యాఖ్య చేసిన సీఎం ఆదిత్యనాథ్‌ను కూడా అబ్దుల్లా పరోక్షంగా హేళన చేశారు. ‘అబ్దుల్లాను నేను కొడుకులా భావించాను. వాళ్ల నాన్న నన్ను నాట్యగత్తె అన్నాడు. వీడూ అలాగే మాట్లాడాడు’’ అని జయప్రద మండిపడ్డారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *