జాతీయవాదం పేరుతో ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తున్న మోది: గెహ్లాట్


జైపూర్: ప్రధానమంత్రి నరేంద్రమోది జాతీయవాదం పేరుతో ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తున్నారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విమర్శించారు. మోదీ తన తప్పిదాల్ని కప్పిపుచ్చుకోవడానికి సంబంధం లేని విషయాల్ని తెరపైకి తీసుకువస్తారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఈ దేశ అత్యున్న న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక ఆరోపణలను పట్టించుకునే తీరిక ప్రధానికి లేదు. ఎందుకంటే ఆయన ప్రజలకు సంబంధంలేని విషయాలను ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నారు’’ అని గెహ్లాట్ విమర్శలు గుప్పించారు.
 
‘‘న్యాయ వ్యవస్థ ఈ దేశ మూల స్థంబం. అలాంటి న్యాయ వ్యవస్థ ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. మోదీ ఈ విషయంపై అస్సలు మాట్లాడరు. ఆయన నిరుద్యోగం గురించి మాట్లాడరు. పేదరికం గురించి పెదవి విప్పరు. కానీ, పాకిస్తాన్ లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ప్రచార సభలు ఏర్పాటు చేసుకుని ప్రసంగాలు చేస్తున్నారు. జాతీయవాదం పేరుతో ప్రజాస్వామ్య వ్యవస్థను కుంటు పరుస్తున్నారు’’ అని అన్నారు.
 
వాస్తవానికి రాజకీయాల్లో నరేంద్రమోదీ కంటే తానే సీనియర్‌నని గెహ్లాట్ అన్నారు. మోదీ రాజకీయ జీవితం కేవలం 20 ఏళ్లేనని తాను 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *