జూన్‌ 30 వరకు బీపీఎస్‌ గడువు పెంపు


అమరావతి, బొబ్బిలి, మే 2(ఆంధ్రజ్యోతి): నిబంధనలను ఉల్లంఘించి నిర్మితమైన కట్టడాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ ఇటీవల ప్రకటించిన బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌(బీపీఎస్ )-2019ని వచ్చే నెల 30 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల హడావిడి కారణంగా ప్రజోపయోగకరమైన ఈ పథకాన్ని రాష్ట్రంలో పలువురు ఉపయోగించుకోలేకపోయారని, అందువల్ల దీని కాలపరిమితిని పొడిగించే అంశాన్ని పరిశీలించాలంటూ డీటీసీపీ వి.రాముడి అఽభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి, అనుమతి కోరింది. ఎన్నికల సంఘం అంగీకరించడంతో జూన్‌ 30 వరకూ బీపీఎస్‌ స్కీమును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పొడిగించిన కాలవ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద మరో 10,000 వరకూ దరఖాస్తులు అందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *