టిక్‌టాక్‌‌పై నిషేధం ఎత్తివేత


చెన్నై: చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌‌పై విధించిన తాత్కాలిక నిషేధాన్ని మద్రాస్ హైకోర్టు ఎత్తివేసింది. జస్టిస్ ఎన్ కిరుబకరన్, జస్టిస్ ఎస్‌ఎస్ సుందర్ నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పును వెల్లడించింది. త్వరలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో టిక్‌టాక్ యాప్ గతంలో మాదిరిగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మద్రాస్ హైకోర్టులో టిక్‌టాక్ కేసుపై నేడు విచారణ జరిగింది. అయితే.. అశ్లీలకర, అభ్యంతరకర వీడియోలను అనుమతించేది లేదని టిక్‌టాక్ హామీ ఇచ్చిన తర్వాతే టిక్‌టాక్‌పై నిషేధాన్ని కోర్టు ఎత్తేసింది.
 
టిక్‌టాక్ యాప్‌ను నిషేధించడం భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనని ఆ యాప్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 24న జరిగే విచారణలో నిషేధంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోని పక్షంలో నిషేధాన్ని ఎత్తేస్తామని సుప్రీం కోర్టు హెచ్చరించిన నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు బుధవారం ఈ తీర్పును వెల్లడించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *