డీఎంకే అభ్యర్థిపై కేసు నమోదు


చెన్నై: ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ తిరుప్పరంగుండ్రం డీఎంకే అభ్యర్థి శరవణన్‌, మాజీ మంత్రి పెరియస్వామి సహా 300 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎంకే అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం శరణవన్‌ ఈనెల 25వ తేదీ కార్యకర్తలతో భారీ ఊరేగింపుగా మదురై తిరునగర్‌లోని తాలూకా కార్యాలయానికి చేరుకొని నామినేషన్‌ దాఖలు చేశారు. అనుమతులు లేకుండా ఎక్కువ మంది గుమికూడారని, ఆరు కార్లకు పార్టీ జెండాలను కట్టి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ శరవణన్‌, పెరియస్వామి సహా 300 కార్యకర్తలపై తిరునగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *