డూప్‌తో గంభీర్‌ ప్రచారం చేయిస్తున్నారు: ఆప్‌


న్యూఢిల్లీ, మే 10: తన బదులు మరో వ్యక్తిని నిలబెట్టి గౌతమ్‌ గంభీర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ‘‘ిక్రికెట్‌లో పరుగులకు రన్నర్‌ను వాడతారని తెలుసు కానీ.. మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో డూప్‌ను చూస్తున్నా. గంభీర్‌ స్థానంలో ఒక కాంగ్రెస్‌ నేత అతనిలా నటిస్తుంటే.. పార్టీ నేతలు పూలమాలలు వేస్తున్నారు. కాంగ్రె్‌సకు, బీజేపీకి మధ్య ఇది మహామిలావట్‌’’ అని పేర్కొంటూ గంభీర్‌ కారులో కూర్చున్న ఫొటోను ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ.. ఆప్‌ అర్థంలేని రాద్ధాంతాలను చేస్తోందని విమర్శించింది. ‘‘ఎండవేడికి నీరసం వచ్చి గంభీర్‌ కాసేపు కారులో కూర్చున్నారు. ఆ సమయంలో పార్టీ నేతలు కారుపైకెక్కి ప్రజల్ని ఉత్సాహపరిచారు. అందులో తప్పేముంది? ప్రతిదాన్ని వివాదం చేయడం ఆప్‌కు అలవాటైపోయింది’’ అని బీజేపీ నేత రాజీవ్‌ బబ్బర్‌ వ్యాఖ్యానించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *