ఢిల్లీ లోక్‌సభ 7 సీట్ల ఫలితాలే ప్రధానిని నిర్ణయిస్తాయా?


న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీ నగరం పరిధిలోని ఏడు లోక్‌సభ స్థానాల ఫలితాలు ఢిల్లీ పాలకులెవరనేది తేల్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. సీట్ల సంఖ్య తక్కువైనా ఢిల్లీ పాలకుడెవరనేది తేల్చడంలో దేశ ఓటరు నాడికి ఇక్కడి ఓటర్లు నాడి పట్టనున్నారు. 1998 పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు సీట్లలో ఆరు సీట్లను కైవసం చేసుకొని అటల్ బిహారి వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పాటైంది. 1999లో బీజేపీ ఢిల్లీలోని అన్ని స్థానాల్లో విజయం సాధించింది. 2004 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆరుసీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ 46.40 శాతం ఓట్లు సాధించి ఘనవిజయం సాధించినా ఏడాదికే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు బీజేపీకి షాక్ ఇస్తూ ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. ఢిల్లీలోని ఏడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ పార్టీ అధిక స్థానాలు సాధిస్తోందో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *