తండ్రీ, కొడుకులు ఇక రిలాక్స్‌..!


బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఎన్నికల బిజీలో గడిపిన జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడ, సీఎం కుమారస్వామిలు ఆయుర్వేద చికిత్సలకు వెళ్ళారు. ఆదివారం సాయంత్రం జేడీఎస్‌ ఎమ్మెల్యేలతో భేటీ అయిన ఇరువురు అగ్రనేతలు ఉడిపికి చేరారు. సోమవారం ఉదయం మంగళూరుకు వి మానంలో వెళ్లిన ఇరువురు అనంతరం ఉడిపిలోని ప్రైవేటు రిసార్టుకు అనుబంధంగా ఉండే ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో రెండు మూడు రోజులు తం డ్రీ కొడుకులు ఇక్కడే గడిపే అవకాశం ఉంది. అయితే స్పష్టంగా ఎన్నిరోజులు ఉడిపిలో ఉంటారనేది ముఖ్యమంత్రి కార్యాలయంగానీ, జే డీఎస్‌ పార్టీ వర్గాలుగానీ ప్రకటించలేదు. రెం డో విడత ఎన్నికల ప్రచారం 21న ముగియగా అదే రోజు రాత్రి సీఎం కుమారస్వామి ఉడిపిలోని ఓ ప్రైవేటు రిసార్టుకు వెళ్ళారు. మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకుంటానని ముం దుగా ప్రకటించారు. అంతలోనే 23 న పోలింగ్‌ రోజున బెళగావికి చెందిన కాం గ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యే రమేశ్‌జార్కిహొళి ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేస్తానని తన వెంట మరింతమంది రానున్నారని బహిరంగ ప్రకటన చేయడంతో పాటు శ్రీలంకలో బాంబు పేలుళ్లలో జేడీఎస్‌ కార్యకర్తలు దుర్మరణం చెందడంతో రెండోరోజునే ముఖ్యమంత్రి వెనుతిరిగి వచ్చారు. మే 23వరకు ఎన్నికల కోడ్‌ అ మలులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. దీంతో సీఎం కుమారస్వామి ఆయుర్వేద చికిత్సలతోపాటు విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *