తక్కువ జీతాలకైనా పనిచేస్తాం: సీఎంతో ‘జెట్’ ఉద్యోగులు


ముంబై: జెట్ ఎయిర్‌వేస్ మూతపడిన తరువాత ఆ సంస్థ ఉద్యోగులంతా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాజాగా జెట్ సంఘం ప్రతినిధులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలుసుకున్నారు. జెట్‌ఎయిర్‌వేస్‌ తిరిగి ప్రారంభమైతే తామంతా తక్కువ జీతాలకైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎంతో మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన ఫడ్నీవీస్ మే 23 తరువాత ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి జెట్ ఉద్యోగులు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. జెట్ ఎయిర్‌వేస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఏప్రిల్ 17న మూతపడింది. కంపెనీ రూ. 8,000 కోట్లకుపైగా అప్పుల్లో కూరుకుపోయింది. సంస్థ మూతబడటంతో 22 వేల మంది ఉద్యోగులు ఇబ్బందుల్లో పడ్డారు. జెట్‌ఎయిర్‌వేస్ గత ఏడేళ్లలో మూతపడిన ఆరవ విమానయాన సంస్థ. 2012లో మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ మూతపడింది. ఆ తరువాత ఎయిర్ అగస్సా, ఎయిర్ కోస్టా, ఎయిర్ కార్నివాల్, జూమ్ ఎయిర్ సంస్థలు మూతపడ్డాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *