తమిళిసై ‘నోటా’ను మించితే సంతోషమే.. ఖుష్బూ చురక


చెన్నై మే 5 (ఆంధ్రజ్యోతి): తూత్తుకుడి లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌ ‘నోటా’ ఓట్ల కంటే అధికంగా ఓట్లు సాధిస్తే తనకు సంతోషమే నని ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ ఎద్దేవా చేశారు. చెన్నైలో విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేరళ, కర్నాటక, ఆంధ్రా, తెలంగాణా, ఒడిసా రాష్ర్టాలలో కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేసి వచ్చానని, త్వరలో ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా ప్రచారం చేయనున్నానని చెప్పారు. తాను పర్యటించిన రాష్ట్రాలలో ప్రధాని మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికా రంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటు న్నారని చెప్పారు. ప్రధాని మోదీకి ప్రస్తుతం ఓటమి భయం పట్టుకోవడం వల్లే కాంగ్రెస్‌ నేతలపైనా, కాంగ్రెస్‌ మాజీ ప్రధానుల పైనా పనిగట్టుకుని బురుద జల్లే విధంగా విమర్శ లు చేస్తు న్నారని ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ను ప్రధాని మోదీ విమర్శి స్తూ రాహు ల్‌ తండ్రి రాజీవ్‌గాంధీ అవినీతి పరుడిగానే మృతి చెందారని చెప్పడం గర్హనీ యమని అన్నారు.
 
మలేగాన్‌ బాంబు పేలు డు సంఘటనకు సంబంధించిన ఉగ్ర వాది బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని ఆమె అన్నారు. ఈ పరిస్థితుల్లోనే బీజేపీ పాలకుల ను ఓటర్లు ఈనెల 23న తరిమి కొట్టేందుకు సిద్ధమ య్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదుచోట్ల పోటీచేస్తున్న బీజేపీ అభ్య ర్థులకు డిపాజిట్లు గల్లంతు కావటం ఖాయమని ఆమె చెప్పారు. తూత్తుకుడిలో పోటీ చేస్తున్న బీజేపీ అధ్యక్షు రాలు తమిళిసై సౌందరరాజన్‌ సముద్రంలో తామర పుష్పించడం తథ్యమని చెప్పడం వింతగా ఉందని, ఉప్పునీటిలో తామర ఎలా పుష్పించగలదో ఆమె వివరిం చాలని ఖుష్బూ అన్నారు. రాష్ట్రంలో డీఎంకే – కాంగ్రెస్‌ కూట మి 35 నుండి 36 స్థానా లను గెలుచుకుం టుందని ఆమె జోస్యం చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *