తిరుపతి.. కిరీటాల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్


చిత్తూరు: తిరుపతి గోవిందరాజుల స్వామి ఉప ఆలయంలోని వెంకటేశ్వరస్వామి, అమ్మవార్ల కిరీటాల చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆకాష్ ప్రతాప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి 1351 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వామి, అమ్మవార్ల కిరీటాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ కిరీటాలను మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఆకాష్ ప్రతాప్ దొంగిలించినట్లుగా గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదుచేసిన దర్యాప్తు చేస్తున్నారు. కాగా, చోరీ ఘటనలో అర్చకుల పాత్ర ఏమీ లేదని తిరుపతి పోలీసులు స్పష్టం చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *