తిరుమలలో కొనసాగుతున్న రద్దీ


తిరుమల, ఏప్రిల్‌ 28: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, వారాంతపు రోజులు కావటంతో శుక్రవారం సాయంత్రం పెరిగిన రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. శ్రీవారి ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్‌లు, అన్నప్రసాద భవనం, గదులు కేటాయింపు కేంద్రాలు, కల్యాణకట్ట, లడ్డూకౌంటర్‌, బస్టాండ్‌.. కొండపై ఎక్కడ చూసినా రద్దీ కనిపిస్తోంది. ఆదివారం శ్రీవారి దర్శనానికి 19 గంటలు పడుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఆదివారం సాయంత్రం 6గంటల సమయానికి సర్వదర్శనం భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 29 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. వీరికి 19 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. స్లాటెడ్‌ భక్తులకు దాదాపు 2-3 గంటల దర్శన సమయం పడుతోంది. మరోవైపు గదులు లభించని భక్తులు ఆరుబయటే సేదతీరుతున్నారు. సోమవారం మధ్యాహ్నం వరకు ఈ రద్దీ కొనసాగే అవకాశాలున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *