తిరుమలలో దళారీ అరెస్ట్‌


  • దర్శనాల పేరిట భక్తులకు టోపీ
తిరుమల, మే 12 (ఆంధ్రజ్యోతి): ఏపీ టూరిజం ద్వారా తిరుమలకు వచ్చే భక్తులకు దర్శనం, వసతి ఏర్పాటు చేస్తానంటూ నమ్మించి డబ్బులు కాజేస్తున్న కార్తీక్‌ అనే దళారీని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి కథనం ప్రకారం.. దర్శనానికి సంబంధించి భక్తులతో బేరం కుదిరాక కార్తీక్‌ తన అకౌంట్‌లో నగదు వేయించుకుని పత్తాలేకుండా పోతాడు. ఇలా అతను ఏడాదిన్నరగా భక్తులను మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది. తెలంగాణ రాష్ట్రం అదిలాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే భక్తుడు టీటీడీ విజిలెన్స్‌ విభాగానికి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఏవీఎస్వో రామ్‌కిషోర్‌ ఆ కేసును తిరుమల పోలీసులకు అప్పగించారు. తిరుమల టూటౌన్‌ సీఐ వేంకటేశ్వర్లు బాధితుడు డబ్బు జమచేసిన అకౌంట్‌ నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టి కార్తీక్‌ ఆట కట్టించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *