తిరుమల: పరకామణిలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన టీటీడీ


తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. 60మంది సిబ్బందిని పరకామణి విధులకు కేటాయించింది. వారం రోజుల్లో నిల్వలన్నీ పూర్తిగా లెక్కించేలా ఏర్పాట్లు చేసింది. పరకామణి వ్యవహారాలను టీటీడీ ఈవో, జేఈవో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వారం రోజుల పాటు పరకామణిలో అదనపు షిఫ్ట్‌ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అదనపు సిబ్బందితో లెక్కింపు కొనసాగిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *