తీరం దాటుతుందా..?


  • ఏప్రిల్‌లో తీరం తాకే తుఫాన్లు స్వల్పం
  • దిశ మార్చుకునేవే అధికం
వేసవి సీజన్‌లో… అందునా ఏప్రిల్‌లో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లలో దిశమార్చుకునేవే ఎక్కువగా ఉంటాయి. ఎండలతో అల్లాడే కోస్తా, తమిళనాడుల్లో ప్రజలు వర్షాల కోసం ఆశపడినా తుఫాన్లు మాత్రం ఊరించి తీరం వరకు వచ్చి దారి మళ్లుతుంటాయి. దీంతో వర్షాల మాట అటుంచి పడమర గాలులతో కోస్తా నిప్పుల కుంపటిలా మారుతుంటుంది. ఏప్రిల్‌లో సముద్రంలో తుఫాను సంభవిస్తే ఎండ తప్ప వర్షం చూసిన సందర్భాలు తక్కువే. గత 120ఏళ్లలో ఏప్రిల్‌లో 15తుఫాన్లు సంభవించగా వాటిలో అతితక్కువ తమిళనాడు నుంచి పశ్చిమబెంగాల్‌ మధ్యలో తీరందాటాయి. 1956 ఏప్రిల్‌ నెలాఖరున నెల్లూరు జిల్లాలో, 1966 ఏప్రిల్‌ చివర్లో కడలూరు వద్ద తీరం దాటాయి. ఇవి తూర్పుతీరాన్ని తాకకపోవడానికి పైనున్న ద్రోణులు కారణమని నిపుణులు చెబుతున్నారు.
 
ప్రస్తుతం ‘ఫణి’ తుఫాను ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరానికి సమీపంగా వచ్చిన తర్వాత దిశ మార్చుకునేందుకు ఉత్తర కోస్తా మీదుగా కొనసాగుతున్న రిడ్జ్‌ కారణమని నిపుణులు విశ్లేషించారు. తుఫానులో పవన వేగం ఎటు తక్కువగా ఉంటే అటువైపుగా దిశ మార్చుకుంటుందని వివరించారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో 31 నుంచి 32 డిగ్రీలు నమోదవుతుంటాయి. కాబట్టి.. ‘ఫణి’ తుఫాను వచ్చేనెల 1వ తేదీ సాయంత్రం దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా పయనించనుందని నిపుణులు తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *