తెలంగాణ ఆర్టీసీ బస్సు బస్సు ఢీకొని వ్యక్తి మృతి


కడప: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే కోడూరు మండలం జ్యోతి నగర్ ప్రధాన రహదారిలో శుక్రవారం తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గాజుల వ్యాపారి తుపాకుల వెంకటరమణ(50) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. గాజుల వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణంలో టీవీఎస్ మోటార్ సైకిల్‌పై వస్తుండగా వెనకవైపు నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో మృతిచెందాడు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు శ్రీకాంత్, అనిల్‌లు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *