తేజ్ బహదూర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు..


న్యూఢిల్లీ: మాజీ జవాను, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి తేజ్‌ బహదూర్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి తాను వేసిన నామినేషన్‌ను ఈసీ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ హేతుబద్ధంగా లేదంటూ దీనిపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తోసిపుచ్చారు.
 
సైన్యం నుంచి బహిష్కరణకు గురైన తేజ్ బహదూర్… ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేస్తున్న వారణాసి నుంచి పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున నామినేషన్ వేశారు. అయితే అవినీతి వల్లగానీ లేదా అవిధేయత వల్లగానీ సైన్యం తనను తొలగించలేదంటూ సర్టిఫికెట్ తీసుకురావడంలో ఆయన విఫలం కావడంతో.. బహదూర్ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సైనికులకు నాణ్యతలేని ఆహారం పెడుతున్నారంటూ తేజ్ బహదూర్ విడుదల చేసిన ఓ వీడియో వైరల్ కావడంతో… 2017లో సైన్యం ఆయనను విధుల్లో నుంచి తొలగించించిన సంగతి తెలిసిందే.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *