థియేటర్‌ భస్మీపటలం


  •  సినిమా చూస్తుండగానే ప్రమాదం
  •  తప్పిన ప్రాణాపాయం.. రూ.3 కోట్ల ఆస్తినష్టం
మలికిపురం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో సోమవారం ఓ థియేటర్‌లో సినిమా ప్రదర్శిస్తున్న సమయంలోనే విద్యుత్‌ షార్టుసర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే.. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన నిర్వాహకులు చిత్రప్రదర్శన నిలిపివేసి ప్రేక్షకులను బయటికి పంపించడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. సాయంత్రం 4.45 గంటల సమయంలో పద్మజ మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌లో జరిగిన ఈ ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాజోలు అగ్నిమాపక సిబ్బంది, ఓఎన్జీసీ ఫైర్‌ సిబ్బంది వచ్చేసరికే నష్టం జరిగిపోయింది. రూ.3 కోట్ల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా. కాగా, ఇటీవలే కోట్ల రూపాయలు వెచ్చించి థియేటర్‌ను ఆధునికీకరించామని, ప్రమాదంతో సర్వం కోల్పోయామంటూ యజమాని యొనుముల లక్ష్మణరావు, ఆయన కుటుంబ సభ్యులు బోరుమన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *