దక్షిణాది రాష్ట్రాలకు ‘ఉగ్ర’ ముప్పు


  • తెలుగు రాష్ట్రాలు సహా.. ఐదు రాష్ట్రాలు, పుదుచ్చేరికీ హెచ్చరిక
  • రద్దీ ప్రదేశాలే టార్గెట్‌
  • బెంగళూరు, మైసూర్‌ల్లో హైఅలర్ట్‌
  • తమిళనాడు రామంతాపూర్‌లో 19 మంది ఉగ్రవాదులు!
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: దక్షిణాది రాష్ట్రాలకు ఉగ్ర ముప్పు పొంచి ఉంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి పోలీసులకు హెచ్చరికలు పంపింది. తొలుత బెంగళూరు, మైసూరు నగరాలను ఉగ్రవాదులు టార్గెట్‌ చేసుకున్నారంటూ ఓ లారీ డ్రైవర్‌ కర్ణాటక పోలీసులకు సమాచారం అందించారు.
 
‘‘వెంటనే అప్రమత్తమయ్యాం. రెండు నగరాల్లో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. వాహనాల తనిఖీలు చేపట్టాం. హోటళ్లలో దిగిన వ్యక్తుల సమాచారం సేకరిస్తున్నాం. అదే సమయంలో.. విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌, రద్దీ ప్రదేశాల్లో నిఘాను ముమ్మరం చేస్తున్నాం’’ అని బెంగళూరు పోలీసు కమిషనర్‌ టి.సుశీల్‌కుమార్‌ విలేకరులకు తెలిపారు. ఐబీ జారీ చేసిన హెచ్చరికల్లో.. తమిళనాడులోని రామంతాపూర్‌లో 19 మంది ఉగ్రవాదులు తలదాచుకున్నారని పేర్కొంది.
 
వీరంతా వేర్వేరుగా 19 ప్రదేశాల్లో పేలుళ్లకు కుట్రపన్నారని వెల్లడించింది. దీంతో.. ఆ రాష్ట్ర పోలీసులు ఉగ్రవాదుల కోసం వేట సాగించారు. శ్రీలంకలో వరస పేలుళ్ల తర్వాత ఉగ్రవాదులు దక్షిణాదిని టార్గెట్‌ చేసుకున్నారని.. రైల్వేస్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘాను పెంచాలని ఆయా రాష్ట్రాల డీజీపీలను ఆదేశించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *