దుర్యోధనుడెవరో, అర్జునుడెవరో ఫలితాలే తేలుస్తాయి : బీజేపీ కౌంటర్


న్యూఢిల్లీ : దుర్యోధనుడికి కూడా ప్రధాని మోదీకి ఉన్న దురహంకారమే ఉండేదని విరుచుకుపడ్డ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఎవరు అర్జునుడో, ఎవరు దుర్యోధనుడో రాబోయే ఎన్నికల ఫలితాలే తేలుస్తాయని బేజేపీ ఢిల్లీ ప్రతిపక్ష నేత విజేందర్ గుప్త అన్నారు. ఈ ఎన్నికలు మహాభారత యుద్ధం లాంటివని తెలిపారు. ప్రచార సమయంలో కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలకు చుక్కెదురైందని, కానీ మోదీకి మాత్రం ప్రజలు అపూర్వమైన ఆదరాభిమానాలను చూపించారని, తమ మద్దతును ప్రకటించారని ఆయన వెల్లడించారు.
 
ప్రధాని మోదీ ప్రచార సభలో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై మాట్లాడితే, ప్రతిపక్షాలు మాత్రం వారివారి సొంత ఉద్యోగాల గురించే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో మొట్ట మొదటి సారిగా ప్రతిపక్షాలు తమ సొంత ఉనికి కోసం పడరాని పాట్లు పడుతున్నాయని, అంతే తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఢిల్లీ పరిధిలోని ఏడు స్థానాలనూ బీజేపీ తిరిగి కైవసం చేసుకుంటుందని, మరో ఐదేళ్లూ ప్రధానిగా మోదీనే ఢిల్లీ ప్రజలు చూడాలనుకుంటున్నారని విజేందర్ గుప్త ప్రకటించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *