దేవినేని సేవలు మరువలేనివి


  •  రెండో వర్థంతి సభలో బుద్దా వెంకన్న
విజయవాడ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి దశ దిశ నిర్దేశించిన నాయకుడు ఎన్టీఆర్‌ అయితే.. కృష్ణా జిల్లాలో టీడీపీని పటిష్ఠం చేయడానికి మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్‌ (నెహ్రూ) అలాంటి పాత్రనే పోషించారని, ఆయన చేసిన సేవలు మరువలేనివని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. బుధవారం విజయవాడలో దేవినేని నెహ్రూ ద్వితీయ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత గుణదలలోని నెహ్రూ ఘాట్‌లో ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో సంతాప సభ నిర్వహించారు. నెహ్రూ కుమారుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, ఆప్కాబ్‌ చైౖర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *