దేవేగౌడ వ్యాఖ్యలను సమర్థించిన మహేశ్‌


బెంగళూరు: మైసూరు కాంగ్రెస్-జేడీఎస్‌ల సంకీర్ణ అభ్యర్థి విజయశంకర్‌ స్వల్ప మెజారిటీతో గెలుపు సాధిస్తారనే ఉన్నత విద్యాశాఖ మంత్రి జి.టి.దేవేగౌడ వ్యాఖ్యలను పర్యాటక శాఖ మంత్రి సా.రా.మహేశ్‌ సమర్థించారు. మైసూరులో సోమవారం సా.రా.మహేశ్‌ మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్‌ కార్యకర్తలు బీజేపీకి ఓట్లు వేశారనే జి.టి.దేవేగౌడ వ్యాఖ్యలు వాస్తవమేనన్నారు. కాంగ్రెస్-జేడీఎస్‌ నేతలు కలసినా కొన్ని చోట్ల కార్యకర్తలు వ్యతిరేకంగా ఉన్నారని అలాంటి చోట జేడీఎస్‌ కార్యకర్తలు బీజేపీకి మద్దతు ఇచ్చారన్నారు. మండ్య నుంచి నిఖిల్‌ లక్షకుపైగా మెజారిటీ సాధిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు. మైసూరులో ఎక్కువ మెజారిటీతో గెలుస్తారనే నమ్మకం లేదన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *