దేశానికి అతిపెద్ద ప్రమాదకారి బీజేపీ : మమతా బెనర్జీ


పశ్చిమబెంగాల్ : బీజేపీ దేశానికే అతిపెద్ద ప్రమాదకారి అని, 440 వోల్టులకు సమానమని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. అందుకే ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం దేశానికి ఎలాంటి ప్రమాదమూ ఉండదని చెప్పారు. హుగ్లీ పట్టణంలో జరిగిన ప్రచార సభలో మమతా మాట్లాడుతూ బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని నాశనం చేస్తారని అందుకే బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. బీజేపీకి హిందూ ధర్మంపై ఎలాంటి గౌరవమూ లేదని, తమది హిందువుల పార్టీ అని వారు ఏవిధంగా చెప్పుకుంటారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. మోదీ హయాంలో దేశంలో ఘర్షణలు, కల్లోలాలు విపరీతంగా జరిగాయని మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *