ధనస్వామ్యంతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం


  • వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు
  • జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌
(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భారత్‌లో పెరిగిపోతున్న ధనస్వామ్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో డబ్బు సంచుల వినియోగం క్రమేణా పెరిగిపోతుందని, ఇందుకు రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా కారణమేనని అన్నారు. కువైత్‌లో శుక్రవారం రాత్రి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు, సంస్కరణల అవసరం గురించి మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోతుందన్నారు. డబ్బు సంచులతో నాయకులవుతున్న వారు వచ్చె ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన డబ్బును సమకూర్చుకునేందుకు అధికార వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. ఏం తాయిలాలు, కానుకలు ఇస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్ధకు శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు. నేరాల విచారణలో రాజకీయ జోక్యం, అవినీతితోపాటు పోలీసు అధికారులకు పని భారం కూడా పెరుగుతోందన్నారు. ఆస్పత్రిలో రోగుల సంఖ్యకు తగినట్లుగా వైద్యులను నియమించకపోతే సేవలందించడంలో విఫలమవుతారని… అదే విధంగా న్యాయ వ్యవస్థలో జడ్జిల సంఖ్యను పెంచకుంటే పెండింగ్‌ కేసుల సంఖ్య పెరుగుతుందన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *