ధాన్యానికి మద్దతు ధర: పౌరసరఫరాల శాఖ


అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డి.వరప్రసాద్‌ చెప్పారు. రాష్ట్రంలో ధాన్యసే కరణపై వార్తాకథనాలు వస్తున్న నేపథ్యంలో 13 జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్లతో శనివారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘రాష్ట్రంలో ఇప్పటివరకు 7,500మంది రైతుల నుంచి రూ.245కోట్ల విలువైన 1.35లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాం. అందులో రూ.130కోట్లు రైతులకు చెల్లించాం.
 
ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ఎలాంటి నిబంధనలు విధించకుండా చెల్లింపులు జరుపుతున్నాం. 22.64 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి గరిష్ఠంగా 30 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్దేశించాం’ అని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజువారీ కొనుగోలు పరిమితి 100మెట్రిక్‌ టన్నులు ఉండగా, కేంద్రాల్లో స్థాయిని బట్టి 300నుంచి 500 మెట్రిక్‌ టన్నులకు పెంచడానికి జాయింట్‌ కలెక్టర్లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. కొనుగోలు సమయం ఆన్‌లైన్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంటల వరకే ఉండగా, దానిని ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు పెంచి, రైతులకు వెసులుబాటు కల్పించామని తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *