ధూమపానం చేసే వారికి షాకింగ్ న్యూస్..!


బెంగళూరు: ఇకపై నిషేధిత ప్రాంతాలలో ధూమపానం చేసేవారు ప్రత్యేక యాప్‌ ద్వారా సాక్ష్యాల సమేతంగా పట్టుబడనున్నారు. పొగాకు నియంత్రణ చట్టం సెక్షన్‌ 4కు అనుగుణంగా పబ్లిక్‌ స్థలాలు అనగా బస్‌స్టాండ్‌, రైల్వేస్టేషన్‌, తదితర ప్రాంతాలలో పొగ త్రాగడం నిషేధించబడింది. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని అన్నిరకాలుగా ప్రచారం గావించినప్పటికీ ధూమపానం చేసేవారి సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతిక ప్రక్రియ ద్వారా ధూమపానానికి అడ్డుకట్ట వేయడానికి అరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో అంతర్భాగంగా ఉన్న కర్ణాటక పొగాకు నియంత్రణ మండలి సిద్ధమైంది. ఈ దశగా ‘స్టాప్‌ టొబాకో’ పేరిట మొబైల్‌ యాప్‌ను సిద్ధం చేసింది. ప్రస్తుతం పబ్లిక్‌ స్థలాల్లో ధూమపానం చేస్తూ పట్టుబడితే చట్ట ప్రకారం వారి నుంచి రూ.200 జరిమానా వసూలు చేస్తున్నారు.
 
అయితే ఇది సక్రమంగా అమలు కావడం లేదన్న వాదన వినిపిస్తోంది. అయితే పొగాకు నియంత్రణ మండలి మండలి రూపొందించిన యాప్‌ వల్ల ప్రజలు ధూమపానం చేసేవారి ఫోటోను తమ స్మార్ట్‌ ఫోన్ల ద్వారా క్లిక్‌ చేసి యాప్‌కు డౌన్‌లోడ్‌ చేసిన సెకన్లలో మెసేజ్‌ రావడమే కాకుండా జిపిఎస్‌ సాంకేతిక ప్రక్రియతో వారున్న స్థలం కూడా ఖచ్చితంగా తెలిసే వీలుంటుంది. దీంతో సంబంధింత అధికారలు చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. పొగాకు ఉత్పత్తులలో 7 వేల రసాయనాలు ఉంటాయని ఇందులో 69 శా తం కేన్సరు వ్యాధి కారణమవుతున్నట్లు ఆరోగ్యశాఖ అసిస్టెంట్‌ డెరెక్టర్‌ డా.ఎం.సెల్వరాజన్‌ వెల్లడించారు. స్టాప్‌ టొబాకో యాప్‌ ద్వారా ధూమపాన నియంత్రణకు చర్యలు చేపట్టామని ప్రయోగాత్మకంగా ఈ యాప్‌ 10 జిల్లాల్లో ప్రారంభించినట్లు తెలిపారు. ఉడిపి, మైసురు, కోలారు, శివమొగ్గ, బెళగావి, రాయచూరు, బళ్ళారి, దావణగెరె, బెంగళూరు గ్రామీణ జిల్లాలను ఎంపిక చేసినట్లు డా.సెల్వరాజ్‌ వెల్లడించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *