నటులను అవహేళన చేసిన ఎమ్మెల్యేపై చర్చలు తీసుకోరా: బీజేపీ నేత


బెంగళూరు: రాష్ట్రంలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వం ప్రతిపక్ష బీజేపీపై కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.రవికుమార్‌ ఆరోపించారు. నగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఓటమి తప్పదని తేలడంతో బీజేపీ నేతలను, మద్దతు దారులను టార్గెట్‌ చేశారన్నారు. ప్రధాన మంత్రిని హత్య చేయాలని బహిరంగంగా ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ, ప్రముఖ నటి సుమలత అంబరీశ్‌తోపాటు నటులు దర్శన్‌, యశ్‌లను పదే పదే అవహేళన చేసిన జేడీఎస్‌ ఎమ్మెల్యే నారాయణగౌడపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా హోం మంత్రి ఎం.బి.పాటిల్‌ ఫిర్యాదు అనంతరం తమ పార్టీ సానుభూతి పరులను అరెస్టు చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఈనెల 6న బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టబోతున్నామన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *