నడిరోడ్డుపై హైడ్రామా!


  • కారులో యువతి కిడ్నాప్‌.. వెంటాడి పట్టుకున్న యువకులు
  • నిందితులకు దేహశుద్ధి, అరెస్ట్‌.. భీమవరంలో క్రైమ్‌ కథా చిత్రమ్‌!
పాలకోడేరు, ఏప్రిల్‌ 30: ఇంటర్నెట్‌ సెంటర్‌కు వెళ్లిన ఒక యువతి తల్లితో కలిసి ఇంటికి వస్తోంది. వేగంగా దూసుకొచ్చిన ఒక కారు వారి ముందు ఆగింది. రెప్పపాటులోనే డోర్‌ తీసి యువతిని కారులోకి లాగి.. వాయువేగంతో కారును పోనిచ్చారు. కూతుర్ని కాపాడే క్రమంలో కారు డోర్‌ను గట్టిగా పట్టుకుంది ఆమె తల్లి. అయినా సరే.. కారులోని వారు కనికరించలేదు. ఆ వేగానికి ఆమె కిందపడిపోయింది. ఈ ఘటన చూసిన కొందరు యువకులు కారును వెంబడించారు. వేగంగా వెళ్లే క్రమంలో కారు ఒకచోట కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. కారు టైరు పేలిపోయింది. అయినా వేగంగా వెళ్తున్న కారును 10 కిలోమీటర్ల త ర్వాత యువకులు సాహసోపేతంగా అడ్డుకున్నారు. యువతిని రక్షించి నిందితులకు దేహశుద్ధి చేశారు. ఒక క్రైమ్‌ కథా చిత్రాన్ని తలపించే ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘ టనపై బాధితులు తెలిపిన వివరాల మేరకు..
 
పాలకొల్లు మండలం పూలపల్లికి చెందిన షేక్‌ నయంతుల్లా ట్యాక్సీ డ్రైవర్‌. అదే గ్రామానికి చెందిన డిగ్రీ చదివిన యువతితో పరిచయం ఏర్పడి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండు కుటుంబాల పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. ఉద్యోగాలొచ్చిన తర్వాత మాట్లాడుకుందామని కౌన్సెలింగ్‌లో నచ్చజెప్పారు. యువతికి భీమవరంలోని ఒక ప్రైవేట్‌స్కూల్‌లో ఉద్యోగం వచ్చింది. తల్లితో కలిసి పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ఉంటోంది. మంగళవారం మధ్యాహ్నం నెట్‌ సెంటర్‌ నుంచి తల్లితో కలిసి తిరిగివస్తున్న యువతిని కారులో వచ్చిన నయంతుల్లా అతని స్నేహితుడు సిరి విస్సాకోడేరు రావిచెట్టు కూడలిలో అడ్డగించారు. యువతిని కిడ్నాప్‌ చేయబోతే అడ్డుకున్న ఆమె తల్లి కారు డోర్‌ పట్టుకుంది. కుమార్తెను రక్షించమని కేకలు వేసింది. అది చూసిన కొందరు యువకులు బైక్‌లపై కారును వెంబడించారు. కారును భీమవరం గునుపూడి మీదుగా తాడేరువైపు వేగంగా పోనిస్తుంటే.. ఆ ఊరు శివారులో ఎట్టకేలకు యువకులు అడ్డుకున్నారు. యువతిని కాపాడి.. నయంతుల్లాకు దేహశుద్ధి చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *