నరేంద్ర మోదీది విధ్వంసకర పాలన


  • నోట్ట రద్దు అతిపెద్ద కుంభకోణం: మన్మోహన్‌
న్యూఢిల్లీ, మే 5: ప్రధాని నరేంద్రమోదీ ఐదేళ్ల పాలన విధ్వంసకరంగా సాగిందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆరోపించారు. మోదీ పాలనలో దేశంలోని యువత, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని అన్నారు. ఆదివారం ఆయన పీటీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశాన్ని అభివృద్ధి చేయడం ద్వారా కాకుండా, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడం ద్వారా తమ ఉనికిని కాపాడుకోవాలనుకున్న మోదీ సర్కారును గద్దె దించాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారన్నారు. గతంలో ఎన్నడూ లేనంత అవినీతి ఈ ఐదేళ్లలో జరిగిందని, నోట్ల రద్దు.. స్వతంత్ర భారత చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు.
 
పాకిస్థాన్‌కు సంబంధించి మోదీ అనుసరిస్తున్న విధానం నిర్లక్ష్యపూరితమైనదని అన్నారు. పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దర్యాప్తునకు ఐఎ్‌సఐకి అవకాశమివ్వడం వంటి వాటిని ఉదహరించారు. మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ జాతీయవాదం, ఉగ్రవాద దాడులను ప్రచార అస్త్రంగా వాడుకుంటుండటంపై మన్మోహన్‌ స్పందిస్తూ.. పుల్వామాలో ఉగ్రదాడి జరిగి 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోతే ప్రధాని మాత్రం డాక్యుమెంటరీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారని విమర్శించారు. విభజించడం, ద్వేషించడమే బీజేపీ విధానమన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *