నర్సరీ రైమ్‌కు ఆర్జేడీ పేరడీ… 'మోదీ మోదీ యస్ పాపా'


పాట్నా: ప్రధాని మోదీని టార్గెట్‌ చేసుకుని లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ ఓ పేరడీ రైమ్ సృష్టించింది. పాపులర్ నర్సరీ రైమ్ ‘జానీ జానీ యస్ పాపా’కు ఇది పేరడీ. అభివృద్ధి లేదు, రైతులు సంతోషంగా లేరు, మహిళలకు భద్రత లేదు, 10 కోట్ల ఉద్యోగాలు లేవు, రూ.15 లక్షల ఊసూలేదు…అబద్ధాలు మాత్రమే మిగిలియి….అంటూ సాగే ఈ రెయిమ్‌ను ఆర్జేడీ బుధవారంనాడు ట్వీట్ చేసింది.
 
‘మోదీ భక్తులు భవిష్యత్తులో ఈ రైమ్ నేర్చుకుంటారు. మోదీ మోదీ యస్ పాపా, ఎనీ డవలప్‌మెంట్? నో పాపా…. ఫార్మర్ హ్యాపీ? నో పాపా… ఉమన్ సేఫ్? నో పాపా… 10 క్రోర్ జాబ్? నో పాపా, 15 లక్షలు?? నో పాపా… ఓన్లీ జుమ్లా? హ హ్హ హ్హ..’ అంటూ ఈ పేరడీ రెయిమ్ (అంత్యప్రాసతో కూడిన పద్యం)ను ఆర్జేడీ ట్వీట్ చేసింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *