నా ప్రయోజనాలకు ‘ఎల్వీ’ మోకాలడ్డు


  • శాప్‌ మాజీ చైర్మన్‌ పీఆర్‌ మోహన్‌
శ్రీకాళహస్తి అర్బన్‌, మే 8: ‘చట్టపరంగా నాకు రావాల్సిన ప్రయోజనాలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలి. శాప్‌ చైర్మన్‌గా ప్రభుత్వం నుంచి నాకు అందాల్సిన ప్రయోజనాలు అందకుండా ఓ ఉన్నతాధికారి అడ్డుకుంటున్నారు’ అని శాప్‌ మాజీ చైర్మన్‌ పీఆర్‌ మోహన్‌ ఆరోపించారు. బుధవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఆయన ఆమేరకు ఫిర్యాదు చేశారు. ‘శాప్‌ చైర్మన్‌గా 2015, జనవరి 28న ప్రభుత్వం నియమించింది. ఆ పదవికి తగ్గట్టు గౌరవ వేతనం, వసతి, ప్రయాణ సదుపాయాలతోపాటు సమావేశాలకు, కార్యకలాపాలకు హాజరైనందుకు తనకు ఖర్చులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అప్పటి క్రీడా విభాగం ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆ బిల్లులను ఇవ్వలేదు. నా పదవీ కాలం 2017 జనవరి 28తో ముగిసింది. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న ఎల్వీ ఇకనైనా మంజూరు చేయాలి’ అని మోహన్‌ కోరారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *