నీవు నా హిట్ లిస్టులో ఉన్నావు…నీ సంగతి రేపు చూస్తా…


  • సర్కిల్ అధికారికి బీజేపీ నేత హెచ్చరిక
కాన్పూర్ : ఓ బీజేపీ నాయకుడు సర్కిల్ అధికారిని బెదిరించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో వెలుగుచూసింది. కాన్పూర్ నగరంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ పోలింగ్ ఏజెంటుతో సర్కిల్ అధికారి వాగ్వాదం చేశారు. అంతలో కాన్పూర్ నగర మేయరు ప్రమీలా పాండే, ఇతర బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ సీనియర్ నేత సురేష్ అవస్థీ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. బీజేపీ పోలింగ్ ఏజెంటుతో గొడవపడుతున్న సర్కిల్ అధికారిని ఉద్ధేశించి సురేష్ అవస్థీ హెచ్చరికలు చేశారు. ‘‘నీవు నా హిట్ లిస్టులో ఉన్నావు… నీ సంగతి రేపు చూస్తా…’’ అంటూ సురేష్ అవస్థీ సర్కిల్ అధికారిని హెచ్చరించారు. బీజేపీ నాయకుడి హెచ్చరిక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. సర్కిల్ అధికారిని బెదిరించిన బీజేపీ నాయకుడు సురేష్ అవస్థీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *