నెలరోజుల తర్వాత మోదీ మాజీ ప్రధాని…అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు


ఔరంగాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రధానమంత్రి ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (మజ్లిస్) పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెలరోజుల తర్వాత మాజీ ప్రధాని అవుతారని అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అసద్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన సాధ్వీ ప్రగ్యాసింగ్ ను భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో దించడంపై ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ భద్రత, ఉగ్రవాదం నిరోధం గురించి ఉపన్యాసాలు చెబుతున్నారని, కాని మాలేగావ్ లో మసీదు సమీపంలో బాంబు పేల్చి ఆరుగురు అమాయకుల ప్రాణాలు బలిగొన్న కేసులో నిందితురాలైన సాధ్వీ ప్రగ్నాకు బీజేపీ టికెట్ ఎలా ఇచ్చారని ప్రధాని మోదీ, బీజేపీ, ఎన్డీఏ, శివసేనలను అసదుద్దీన్ ప్రశ్నించారు. ఉగ్రవాద దాడి కేసులో నిందితురాలైన సాధ్వీకి బీజేపీ టికెట్ ఇవ్వడం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం సాగించడమా అని అసద్ ప్రశ్నించారు. ప్రగ్నాఠాకూర్ హేమంత్ కర్కరే గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ఓటర్లను ప్రధాని మోదీ ఎలా ఓట్లు అడుగుతారని అసద్ ప్రశ్నించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *