నెలలోనే గ్రూప్‌-3 స్ర్కీనింగ్‌ రిజల్ట్‌


అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-3 స్ర్కీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలు నెల రోజుల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ తెలిపారు. ఆదివారం నిర్వహించిన ఈ పరీక్షకు 2,94,966(75.82ు) మంది హాజరయ్యారని చెప్పారు. మొత్తం 1051 పంచాయతీ సెక్రెటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశామని చెప్పారు. పంచాయతీ సెక్రెటరీ పోస్టులు జిల్లా స్థాయి పోస్టులని, జిల్లా వారీగా ఒక్కో పోస్టుకు కనీసం 12 మంది అభ్యర్థులను మెయిన్స్‌ రాసేందుకు ఎంపికచేస్తామన్నారు. గ్రూప్‌-3 మెయిన్స్‌ ఆగస్టు 2న జరుగుతుందని ఆయన తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *