నెల్లూరు జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మృతి


నెల్లూరు: జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. తడకు చెందిన రామయ్య, బుజ్జయ్య ఇద్దరు వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లారు. అయితే విపరీతమైన ఎండలతో వీరు సొమ్మసిల్లిపోయారు. కాసేపటికే ప్రాణాలు విడిచారు. ఉదయం నుంచే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతోంది. మరో రెండు రోజులు ఎండ మంటలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గురువారం ఏకంగా 52ప్రాంతాల్లో 45- 47 డిగ్రీల మధ్య, 225 ప్రాంతాల్లో 43- 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తాడేపల్లిగూడెంలో అత్యధికంగా 47డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జంగమహేశ్వరపురంలో 44.6, కావలిలో 44.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *