నేటికల్లా అల్పపీడనం


విశాఖపట్నం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ద్రోణి, దానిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో శ్రీలంకకు ఆగ్నేయంగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో గురువారం నాటికి అల్పపీడనం ఏర్పడనున్నది. ఆ తరువాత 36 గంటల్లో బలపడి వాయుగుండంగా మారనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. తరువాత వాయువ్యంగా పయనించి తుఫాన్‌గా బలపడి దక్షిణ తమిళనాడు తీరం దిశగా రానున్నదని తెలిపింది. కాగా బుధవారం రాయలసీమ, కోస్తాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. కర్నూలులో 42.3 డిగ్రీలు నమోదైంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇంకా ఎండ తీవ్రత పెరిగే అవకాశం వున్నదని తెలిపింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *