నేటి నుంచి టీడీపీ సమీక్షలు


అమరావతి, మే 3 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానంతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమీక్షలు శనివారం నుంచి ప్రారంఢం కానున్నాయి. గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న హ్యాపీ రిసార్ట్స్‌లో ఈ సమావేశాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలె జరిగే ఈ సమీక్షలకు లోక్‌సభ స్థానం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యాభై మంది చొప్పున ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ సరళిని సమీక్షించడంతో పాటు తాజా రాజకీయ పరిస్ధితుల విశ్లేషణ, ఎన్నికల నిర్వహణ తీరు, కౌంటింగ్‌ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తల వంటి వాటిపై చర్చ జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సమీక్ష కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత ఎన్నికల్లో పనిచేసిన సీబీఎన్‌ ఆర్మీ యువ కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అవుతారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *