నేడు గ్రూప్‌-3 స్ర్కీనింగ్‌ టెస్ట్‌


  •  ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష
  •  రాష్ట్రవ్యాప్తంగా 1,320 కేంద్రాల్లో నిర్వహణ
  •  1,051 పోస్టులకు 4,95,526 మంది దరఖాస్తు
  •  అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన ఏపీపీఎస్సీ
అమరావతి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-3 సర్వీసెస్‌ (పంచాయతీ కార్యదర్శి – గ్రేడ్‌-4) స్ర్కీనింగ్‌ టెస్ట్‌ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరగనుంది. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. 13 జిల్లాల్లో మొత్తం 1320 కేంద్రాల్లో స్ర్కీనింగ్‌ టెస్ట్‌ జరుగుతుంది. మొత్తం 1051 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా .. 4,95,526 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఎ.కె.మౌర్య తెలిపారు.
 
అభ్యర్థులు గమనించాల్సిన అంశాలు :
  • అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు అనుమతిస్తారు. మరో 15 నిమిషాలు గ్రేస్‌ పీరియడ్‌ (9.45) ఉంటుంది. ధ్రువీకరణ కోసం తప్పనిసరిగా హాల్‌టికెట్‌ చూపించాలి. ప్రభుత్వం జారీచేసిన ఒరిజినల్‌ వాలిడ్‌ ఫోటో గుర్తింపు కార్డులు … పాస్‌పోర్టు, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడి, ప్రభుత్వ ఉద్యోగి ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌లలో కనీసం ఒక్కటైనా తీసుకురావాలి.
  • ఓఎంఆర్‌ షీట్స్‌లో అభ్యర్థుల హాల్‌ టికెట్‌ నెంబరు, పేరు, పరీక్షా కేంద్రం (వెన్యూ) వివరాలు ముద్రించి ఉంటాయి. వీటి వెరిఫికేషన్‌ కోసం అభ్యర్థులు టెస్ట్‌ బుక్‌లెట్‌ సిరీస్‌ మరియు సమాధానాన్ని బ్లూ లేదా బ్లాక్‌ పెన్‌తో బబ్బుల్‌ చేయాలి. టెస్ట్‌ బుక్‌లెట్‌ సిరీ్‌సను తప్పుగా బబ్లింగ్‌ చేస్తే సమాధానపత్రం ఇన్‌వాలిడ్‌ అవుతుంది. వైట్నర్‌ వినియోగం నిషేధం.
  • ఎలకా్ట్రనిక్‌ పరికరాలు .. సెల్‌ఫోన్‌, కాలిక్యులేటర్‌ను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
  • అర్హులైన దివ్యాంగ అభ్యర్థులకు అదనపు సమయాన్ని అనుమతిస్తారు. అవసరమైన వారికి స్ర్కైబ్‌ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేస్తారు.
  • పరీక్షలో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం అమలు చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కట్‌ చేస్తారు.
జిల్లాల వారీగా పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులు
శ్రీకాకుళం-37,201, విజయనగరం-31,007, విశాఖపట్నం-60,643, తూర్పుగోదావరి-61,125, పశ్చిమగోదావరి-26,617, కృష్ణా-30,523, గుంటూరు-41,501, ప్రకాశం-40,982, నెల్లూరు-27,488, చిత్తూరు-47,773, కడప-4,214, అనంతపురం-32,682, కర్నూలు-53,770.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *