నేను బయటికి రాలేదు… దేవెగౌడ నన్ను బహిష్కరించారు :సిద్దరామయ్య



బెంగళూరు : జేడీఎస్ నుంచి తనంతట తాను బయటికి రాలేదని, జేడీఎస్ అధినేత దేవేగౌడ తనను పార్టీ నుంచి బహిష్కరించారని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య స్పష్టతనిచ్చారు. జేడీఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎందుకు, ఎలా వచ్చారని బీజేపీ వాళ్లు అడుగుతున్నారని, వాళ్లు అసలు సత్యాన్ని గ్రహించాలని కోరారు. తనంతట తాను బయటికి రాలేదని, దేవెగౌడ తనను బహిష్కరించారని ఆయన తెలిపారు.‘అహింద’ ఉద్యమంలో పాల్గొన్న కారణంగానే తనను బయటికి పంపించారని ఇప్పుడైనా బీజేపీ వాళ్లు ఈ విషయాన్ని గ్రహిస్తారని తాను నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *