నేను రాజకీయాల్లోకి రావాలని నా తండ్రి కోరుకోలేదు : ఉత్పల్ పర్రీకర్


గోవా : తనను కాదని పర్రీకర్ అనుంగు అనుచరుడు సిద్ధార్థ్‌కి పనాజీ ఉప ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించడంపై దివంగత సీఎం పర్రీకర్ కుమారుడు ఉత్పల్ స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావాలని తన తండ్రి ఎన్నడూ కోరుకోలేదని, ఇవేమీ కుటుంబ రాజకీయాలు కావని ఆయన స్పష్టం చేశారు. తన తండ్రి బతికి లేరని, ప్రస్తుతం తాను స్వతంత్రుడనని, తన గుర్తింపు తనకు ఉందని ఆయన తెలిపారు. మనోహర్ పర్రీకర్ మరణించడంతో పనాజీ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ సీటు పర్రీకర్ కుమారుడు ఉత్పల్‌కే కేటాయిస్తారని చివరి వరకూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ సీటు నుంచి ఆరెస్సెస్ గోవా మాజీ అధ్యక్షుడు సుభాష్ వెలింగ్‌కర్ తానూ రేసులో ఉన్నానని ప్రకటించడంతో బీజేపీ అధిష్ఠానం పునరాలోచనలో పడింది.
 
అంత సీనియర్ నాయకుడు రంగంలోకి దిగితే వాతావరణం మరోలా ఉంటుందని, అంతటి సీనియర్ నాయకునితో ఉత్పల్ లాంటి అతి జూనియర్ నేత పోటీ పడటం సాధ్యం కాదేమోనని గోవా సీనియర్లు కొంత అనుమానం వ్యక్తం చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న బీజేపీ అధిష్ఠానం చివరి నిమిషంలో పర్రీకర్ అనుంగు అనుచరుడు సిద్ధార్థ్‌ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ నిర్ణయం వెలువరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *