నేనే నిజమైన చౌకీదారును…ఆర్మీ మాజీజవాన్ ప్రకటన


వారాణసీ : వారాణసీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విజయం సాధిస్తానని బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు.సైన్యానికి నాసిరకం వంట సరుకులు సరఫరా చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసి, ఉద్యోగం కోల్పోయిన మాజీ బీఎస్ఎఫ్‌ కానిస్టేబుల్‌ తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ తన ఎన్నికల హామీలను వెల్లడించారు. తాను ఆర్మీ జవాన్లు, రైతులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతోపాటు అన్ని వర్గాల ప్రజల సమస్యలను తీరుస్తానని ఆయన హామి ఇచ్చారు. ఈ దేశానికి నిజమైన చౌకీదార్ ఎవరో ప్రజలకు తెలుసునని ఆయన చెప్పారు. దేశానికి తానే నిజమైన చౌకీదారునని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని పునరుద్ఘాటించారు.కాలిపోయిన రొట్టెలు, నీళ్ల చారును సైనికులకు భోజనంగా వడ్డించారంటూ 2017లో తేజ్‌ బహదూర్‌ విడుదల చేసిన వీడియో అప్పట్లో వైరల్‌ అయింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *