నోరు జారాను: శత్రుఘ్నసిన్హా


పాట్నా: పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ ఆలీ జిన్నాపై తాను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో కాంగ్రెస్ నేత శత్రుఘ్నసిన్హా శనివారంనాడు వివరణ ఇచ్చారు. ఒకటి చెప్పబోయి మరొకటి చెప్పానని, నోరు జారిందని చెప్పారు. మౌలానా ఆజాద్ పేరు చెప్పబోయి పొరపాటున మహమ్మద్ అలీ జిన్నా పేరు చెప్పినట్టు తెలిపారు.
 
బీహార్‌లోని పట్నా సాహిబ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిన్హా శుక్రవారంనాడు మాట్లాడుతూ, కాంగ్రెస్ కుటుంబంలో జిన్నా కూడా భాగస్వామని, దేశ స్వాతంత్ర్యం, అభివృద్ధిలో మహాత్మాగాంధీలాగే జిన్నా కూడా కీలక భూమిక పోషించారని అన్నారు. జిన్నాను ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలను బీహార్ బీజేపీ నేత సుశీల్ కుమార్ షిండే ఎద్దేవా చేస్తూ ‘అదృష్టం…సిన్హా బీజేపీలో లేరు. ఆయన  కాంగ్రెస్‌లో ఉన్నంత వరకూ ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవు’ అంటూ వ్యాఖ్యానించారు. విషయం గ్రహించిన శత్రుఘ్నసిన్హా తన వ్యాఖ్యలపై ఇవాళ వివరణ ఇచ్చారు. ‘నిన్న నేను ఏదయితే చెప్పానో అది నోరుజారి చెప్పినదే. మౌలానా ఆజాద్ పేరు చెప్పబోయి ముహమ్మద్ అలీ జిన్నా పేరు చెప్పాను’ అంటూ వివరణ ఇచ్చారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *