న్యూఢిల్లీ సీటు మీనాక్షీ లేఖీకే


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: లోక్‌సభ ఎన్నికలలో పలు రాష్ట్రాల్లో పార్టీలు సోమవారం తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఢిల్లీలో మొత్తం ఏడు సీట్లకుగాను ఒక్కటి మినహా ఆరు స్థానాలకూ బీజేపీ అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది. న్యూఢిల్లీ నుంచి సిటింగ్‌ ఎంపీ మీనాక్షీ లేఖీకి మళ్లీ అవకాశం కల్పించింది. బీజేపీ చాందినీచౌక్‌, ఈశాన్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ నుంచి సిటింగ్‌లకు ఆదివారమే ఖరారు చేసింది. వాయవ్య ఢిల్లీ అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. యూపీలో మరో మూడు సీట్లకు కాంగ్రెస్‌ సోమవారం అభ్యర్థులను ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ఇంతవరకు 421 సీట్లలో అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది. అలహాబాద్‌లో యోగేశ్‌ శుక్లాకు టికెట్‌ ఇచ్చింది. వారం క్రితమే ఎస్పీలో చేరిన బీజేపీ మాజీ ఎంపీ రాంచరిత్ర నిషాద్‌కు ఎస్పీ యూపీలోని మీర్జాపూర్‌ టికెట్‌ ఇచ్చింది. చౌటాలాకు సోనేపత్‌ టికెట్‌ లభించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *