పక్కాగా వేసవి కార్యాచరణ


  • తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి
  • మూడు రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు
  • మీకోసంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌
ఆంధ్రజ్యోతి మచిలీపట్నం: జిల్లాలో వేసవి కార్యాచరణ ప్రణాళిక పక్కాగా అమలు చేసేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ హాలులో సోమవారం మీ – కోసంలో ఆయన మాట్లాడుతూ రాష్టంలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని సూచించారు. అవసరమైతే వివిద స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలన్నారు.
 
ఆసుపత్రులు, బస్టాండ్‌లు, చర్చిలు, మసీదులు, జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు, అక్కడే ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. తీర్రపాంత గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరాచేయాలని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవు తున్నందున అగ్రిప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో ఇటీవల రోజుకు 5 నుంచి 10 వరకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆదివారం ఒకే రోజు 28 ప్రమాదాలు సంభవించాయన్నారు. ఎండ తీవ్రత దృష్ణ్యా రోడ్లపై ఫైరిజంన్‌లతో నీటిని చల్లించాలని ఆయన సూచించారు.
 
మీ- సేవ అర్జీలు పరిష్కరించండి ఫ జేసీ కృతికా శుక్లా
మీ సేవ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 2692 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 1900 వరకు ఆక్రమణల క్రమబద్ధీకరణ, పట్టాదారు పాస్‌ పుస్తకాల జారీకి చెందినవని జేసీ కృతికా శుక్లా తెలిపారు. వీటిని క్షుణ్టంగా పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీలు అందజేశారు. జేసీ-2 బాబూరావు, డీఆర్వో ఎ. ప్రసాద్‌, ఆర్‌డీవో జే.ఉదయభాస్కర్‌, డీఆర్‌డీఏ పీడీ ఎం. శ్రీనివాసరావు, మత్స్యశాఖ జేడీ యాకూబ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *