పద్మావతి వర్సిటీ పీజీ సెట్‌ నోటిఫికేషన్‌.. 29 కోర్సుల్లో ప్రవేశాలు


  • పద్మావతి వర్సిటీ పీజీ సెట్‌ నోటిఫికేషన్‌
  • 29 కోర్సుల్లో ప్రవేశాలు
  • దరఖాస్తుకు గడువు మే 6 8 19న ప్రవేశ పరీక్ష
  • తెలుగు రాష్ట్రాలలో 5 పరీక్ష కేంద్రాలు
  • డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థినులకు అవకాశం
తిరుపతి: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పీజీ ప్రవేశాలకు (ఎస్‌పీ ఎంవీవీ పీజీ సెట్‌ -19) నోటిఫికేషన్‌ విడుదల అయింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మహిళలకు ఉన్న ఒకే ఒక్క విశ్వవిద్యాలయం ఇది. తెలంగాణాతో పాటు ఇటు ఏపీ నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటారు. 29 కోర్సుల ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు. పోటీ తీవ్రంగా ఉన్నా.. సీటు లభిస్తే ఉన్నత కొలువులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పీజీతో పాటు వృత్తివిద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తుకు మే 6 వరకు అవకాశం ఉంది. జిల్లాలో డిగ్రీ, ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థినులు, ఇప్పటీకే డిగ్రీ, ఇంజనీరింగ్‌ పట్టా పొందిన విద్యార్థినులకు చక్కని అవకాశం.
 
కోర్సులు: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ, నర్సింగ్‌తో పాటు ఎంఎస్‌సీ, ఎంఏ, ఎంకాం వంటి 50కిపైగా కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం ఎంఎస్‌సీ, ఎంఏ, ఎంకాంతో పాటు మొత్తం 29 కోర్సులకు పీజీ సెట్‌ ద్వారా ప్రవేశాలను కల్పించనున్నారు.
 
సైన్స్‌ కోర్సులు: ఎమ్మెస్సీలో మొత్తం 15 కోర్సుల్లో ప్రవేశాలకు వర్సిటీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లైడ్‌ మ్యాథమాటిక్స్‌, అప్లైడ్‌ మైక్రోబయాలజీ, ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ, బయోకెమిస్ర్టీ, బయోటెక్నాలజీ, ఆర్గానిక్‌ కెమిస్ర్టీ, ఫిజిక్స్‌, బాటనీ, జువాలజీ, సెరీకల్చర్‌, స్టాటిస్టిక్స్‌, హోమ్‌ సైన్స్‌ ఇన్‌ క్లినికల్‌ న్యూట్రీషన్‌ అండ్‌ డైటటిక్స్‌, కమ్యూనిటీ హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్‌, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ క్యాలిటీ కంట్రోల్‌, హోంసైన్స్‌ ఇన్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫ్యామిలీ స్టడీస్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
 
ఆర్స్ట్‌ కోర్సులు: మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో మొత్తం 5 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంఏ ఎకనామిక్స్‌, తెలుగు, ఉమెన్‌ స్టడీస్‌, ఇంగ్లీష్‌, భరత నాట్యం, ఓకల్‌, వీణతో పాటు మాస్టర్స్‌ ఇన్‌లో సోషల్‌ వర్క్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (ఎంపీఈడీ), కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, ఎడ్యుకేషన్‌, కామర్స్‌, బ్యాచిలర్స్‌ ఇన్‌ బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
 
ఒకేషనల్‌ కోర్సు: ఎం ఒకేషనల్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ అండ్‌ అప్పరల్‌ డిజైనింగ్‌, న్యూట్రీషన్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ సైన్స్‌స్‌ కోర్సులతో పాటు 5 సంవత్సరాల బీఏ/ఎంఏ పబ్లీక్‌ పాలసీ అండ్‌ ఆంథ్రోపాలజీ కోర్సులో ప్రవేశాలకు కూడా ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.
 
విద్యార్హతలు: డిగ్రీలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన మహిళలు సైన్స్‌, ఆర్ట్స్‌ పీజీ గ్రూపులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.425. వర్సిటీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత అభ్యర్థి మెయిల్‌కు లేదా సెల్‌ ఫోన్‌కు మేసేజ్‌ వస్తుంది. మే 6న దరఖాస్తుకు చివరి తేదీ. తుది గడువు ముగిసిన రెండు, మూడు రోజుల తరువాత హాల్‌ టికెట్లు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. వర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
 
మే 19న ప్రవేశ పరీక్ష
దరఖాస్తు చేసుకున్నవారికి మే 19న ప్రవేశ పరీక్ష ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తిరుపతి శ్రీ పద్మావతీ మహిళా విశ్వ విద్యాలయంతో పాటు, కర్నూలు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలలో ప్రవేశ పరీక్ష జరుగుతుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *