పనాజీ అభ్యర్థి పర్రీకర్ కొడుకు కాదు… అనుంగు అనుచరుడు


గోవా : పనామా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్ కుమారుడు ఉత్పల్ పర్రీకర్‌ను కాదని పర్రీకర్ అనుంగు అనుచరుడు సిద్ధార్థ్ కుంకల్యేకర్‌ను బీజేపీ అధిష్ఠానం తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ ఎన్నికల వ్యవహారాల బాధ్యుడు జే.పి. నడ్డా ఓ ప్రకటన విడుదల చేశారు. రేసులో పర్రీకర్ కొడుకు ఉత్పల్ పేరే ఖరారవుతుందని చక్కర్లు కొట్టినా చివరి నిమిషంలో బీజేపీ సిద్ధార్థ్‌ను తెరపైకి తెచ్చి ఉత్పల్ ఆశలపై నీళ్లు చల్లింది. పనాజీ నుంచి తాను కూడా బరిలోకి దిగుతానని ఆరెస్సెస్ గోవా మాజీ అధ్యక్షుడు సుభాశ్ వెలింగ్‌కర్ ప్రకటించిన మరుక్షణమే బీజేపీ జాగ్రత్తపడి సిద్ధార్థ్ పేరును ప్రతిపాదించిందని ఓ ప్రచారమూ నడుస్తోంది.
 
ఎప్పుడైతే వెలింగ్‌కర్ తానూ పోటీలో ఉన్నట్లు ప్రకటించడంతో బీజేపీ జాగ్రత్త పడిందని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారు. ఎందుకంటే ఆయన బరిలోకి దిగగానే వాతారణం పూర్తిగా మారిపోతుందని, దాన్ని తట్టుకోవడం ఉత్పల్‌కు సాధ్యం కాకపోవచ్చేమోనని పార్టీ సీనియర్లు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు సిద్ధార్థ్ కుంకల్యేకర్ దివంగత సీఎం మనోహర్ పర్రీకర్ అనుంగు అనుచరుడిగా పేరు గడించారు. 2015 లో మనోహర్ పార్రీకర్ కేంద్ర కేబినెట్‌లో చేరడంతో పనాజీ నుంచి సిద్ధార్థ్ పోటీ చేసి మొదటిసారిగా గెలుపొందారు. తర్వాత 2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి పనాజీ నుంచి గెలుపొందారు. అయితే మనోహర్ పర్రీకర్ కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి తిరిగి గోవా రాజకీయాల్లో ప్రవేశిచడంతో సిద్ధార్థ్ రాజీనామా చేశారు. తర్వాత పర్రీకర్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *