పబ్జీ ఆడి పిచ్చోడైన పాతబస్తీ యువకుడు


హైదరాబాద్: ‘అరేయ్.. వాడు నీ వెనకాలే వస్తున్నాడు.. వాడిని చంపేయ్.. పక్కన గన్ ఉంది అది తీసుకోరా.. ఇంకా పదిమంది ఉన్నారక్కడ వాళ్లను కూడా చంపెయ్యాలి’ ఇవి పబ్జీ గేమ్ ఆడుతున్న వాళ్ల సంభాషణలు. చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు ప్రపంచాన్ని మరచిపోయి గేమ్‌లోనే బతికేస్తున్నారు. ఓ యువకుడు పబ్జీ గేమ్ ఆడి.. పిచ్చోడిలా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు.
 
అతనొక్కడే కాదు.. ప్రస్తుతం యువతలో చాలా మందిది ఇదే తీరు. ఇండియాలో పబ్జీకి ఫుల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా యూత్ ఆ మాయలో పడిపోయారు. పబ్జీయే ప్రపంచం అనేంతగా ఆ ఆట మాయలో పడిపోయారు. పాతబస్తీకి చెందిన ఓ యువకుడు పబ్జీ మాయలో పడి పిచ్చోడైపోయాడు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో అతనికి అనవసరం. ఇప్పుడు ఈ యువకుడి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *