పర్యాటక రంగానికి సీఎం పెద్దపీట


సినిమా, టీవీ, నాటకరంగ సంస్థ చైర్మన్‌ అంబికా కృష్ణ
 
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాటక రంగానికి పెద్దపీటవేస్తూ రాష్ట్ర ప్రజలకు వినోదాన్ని వివిధ రకాలుగా అంది స్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ సినిమా, టీవీ, నాటకరంగ సంస్థ చైర్మన్‌ అంబికా కృష్ణ అన్నారు.
గరిమళ్ళ సుబ్బారావు కళావేదికపై బుధవారం నాటకరంగ కళాకారుల సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిఽథి అంబికా కృష్ణ మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో వినోద రంగం చాలా వెనుకబడి వుందని అన్నారు. ఈ రంగం ఎంతో అభివృద్ధి చెందవలసి వుందని, ఈ రంగం ద్వారా ఎంతో మందికి ఉపాధి అందించవచ్చని అన్నారు. ఒక సర్వే ప్రకారం వినోద రంగంలో కోటి రూపాయలు పెట్టుబడి అనేక మందికి ఉపాధి అందించవచ్చని అదే ఇతర పారిశ్రామిక రంగాలలో కోట్లు పెట్టినా కొంతమందికి మాత్రమే ఉపాధి లభిస్తుందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత టూరిజంను అభివృద్ధి చేశారని, నగర ప్రజలకు కృష్ణానదిలో బోటింగ్‌ అందించారని ఆయన అన్నారు. అనంతరం నాటకరంగంలోని ప్రముఖులను సత్కరించారు.
కార్యక్రమంలో గరిమెళ్ళ నానయ్యచౌదరి, జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *