పర్షియన్‌ గల్ఫ్‌లో ఉద్రిక్తత


  • మధ్యప్రాచ్యంవైపు క్షిపణుల తరలింపు
  • రెండు యుద్ధనౌకల మోహరింపు
  • యుద్ధం మా అభిమతం కాదు: ఇరాన్‌
  • ఇరాన్‌ను నమ్మలేం: ట్రంప్‌ సర్కార్‌
వాషింగ్టన్‌, మే 11: ఆంక్షలతో ఇరాన్‌ను అష్టదిగ్బంధనం చేసిన అమెరికా ఇప్పుడు యుద్ధ సన్నాహాలతో ఇస్లామిక్‌ దేశాన్ని బెంబేలెత్తిస్తోంది. మధ్యప్రాచ్యంవైపు భారీ సంఖ్యలో పేట్రియట్‌ క్షిపణులను తరలిస్తోంది. యుద్ధనౌక యూఎ్‌సఎస్‌ అబ్రహాం లింకన్‌కు తోడు యూఎ్‌సఎస్‌ ఆర్లింగ్టన్‌ను పర్షియన్‌ గల్ఫ్‌వైపు మరల్చింది. అవసరమైన పక్షంలో పేట్రియట్‌ క్షిపణులను అబ్రహాం లింకన్‌ యుద్ధనౌక నుంచే ప్రయోగిస్తారు. ఇది ప్రస్తుతం ఈజి్‌ప్టలోని సూయెజ్‌ కాలువ దాటి ఎర్రసముద్రంలో ప్రయాణిస్తోంది. ఇరాన్‌ నుంచి ముప్పు ఉన్నట్లు తమకు నిర్దిష్ట సమాచారం అందిందనీ, స్వల్పదూర లక్ష్యాలపైకి ప్రయోగించే క్షిపణులను ఇరాన్‌ పడవల్లో తరలిస్తోందని, అందుకే తామూ వాటిని ఎదుర్కొనేందుకు పేట్రియట్లను రంగంలోకి దింపుతున్నామని అమెరికా తాత్కాలిక రక్షణమంత్రి పాట్రిక్‌ షానహన్‌ తెలిపారు.
 
గల్ఫ్‌లో తమ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ఇరాన్‌ వీలైన అన్ని మార్గాలనూ అన్వేషిస్తోందని ఆయన అన్నారు. కతార్‌లో ఇప్పటికే బీ-52 బాంబర్లను అమెరికా మోహరించింది. ఇరాన్‌ను నిరోధించేందుకే ఈ మోహరింపు అని పెంటగాన్‌ స్పష్టం చేసింది. అయితే ఇరాన్‌ మాత్రం దీన్ని యుద్ధోన్మాదమనీ, తమను రెచ్చగొట్టడానికి మానసికంగా తమను దెబ్బతీసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించింది. అమెరికాతో ఘర్షణను తాము కోరుకోవడం లేదని కూడా స్పష్టం చేసింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *