పశుసంపద ఉంటేనే ఇళ్లు కళకళలాడేవి: వెంకయ్య


తిరుపతి: పశుసంపద ఉంటేనే ఇళ్లు కళకళలాడేవని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం తిరుపతిలోని వెటర్నరీ యూనివర్సిటీ 8వ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పంట నష్టం వచ్చినా.. పశుసంపద ఆసరాగా నిలిచేదని అన్నారు. మన సంస్కృతిలో వేల ఏళ్లుగా పశుసంపద భాగంగా ఉందన్నారు. పశువైద్య విద్యలో ఉన్నతస్థాయి ప్రమాణాలు అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా విద్యార్థులు తయారుకావాలన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ కూడా హాజరయ్యారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *